Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే తనకు ప్రశంసలు దక్కాయన్న రోజా.. ఉన్నతాధికారులతో…
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు…
Off The Record: బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనగా మారాయి….కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి…. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడ్‌గా చేయడం చారిత్రక తప్పిదం అని ఆయన అన్న మాటలు సొంత పార్టీ వైసీపీలోనే సెగలు పొగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఎస్సీలను అవమానించేలా కోన రఘుపతి మాట్లాడారంటూ ఆ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు రగిలిపోతున్నారట. వ్యవహారం కోనకు వార్నింగ్‌లు ఇచ్చేదాకా…
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2009,14,19ల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు బ్రేకులు వేసేందుకు ఒకసారి పీఆర్పీ, రెండు సార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా అంతంత మాత్రమే. అయినా… వెలగపూడికి మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు, వర్గ…
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో…
టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు.
కేంద్ర నగర వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి నివాసంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపైమరొకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. చంద్రబాబు విసిరిన సెల్ఫీ సవాల్‌పై వైసీపీ తీవ్రంగా స్పందించింది.
Off The Record: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు. గతంలో సొంత పార్టీ నేతల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద… సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆరున్నొక్క రాగాన్ని ఆలపించిన వసంత…సీఎం జగన్‌తో భేటీ తర్వాత కాస్త మెత్తబడ్డారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన తాజా చర్య తిరిగి కలకలం రేపుతోందట. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దాన్ని కట్టడి చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఇతర…
Jogi Ramesh: నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. టిడ్కో ఇళ్లను నేనే కట్టేసానని చెప్పుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబుది మేనిఫెస్టో పార్టీకాదు.. సెల్ఫీల పార్టీ.. చార్మినార్, తాజ్‌మహల్ కూడా తానే కట్టేశానని ఓ సెల్ఫీ తీసుకునేట్టున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. తండ్రీ, కొడుకులు సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలు అని కామెంట్ చేశారు.. చంద్రబాబే టిడ్కోఇళ్లన్నీ…