Kodali Nani Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. గుడివాడలో పేదలకు ఇళ్ల కోసం ఒక్క ఎకరం భూమి చంద్రబాబు కొన్నారా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్ చేశారు.. నిమ్మకూరుకు ఎంతో చేశామని చెప్పడానికి సిగ్గుందా? అని మండిపడ్డారు కొడాలి నాని.. అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది కూడా చంద్రబాబు కాదు.. నేను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షల రూపాయలు పెట్టి 2003లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశాం అన్నారు..అసలు నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవన్నారు కొడాలి నాని..
మరోవైపు.. చంద్రబాబు ఓ 420 అంటూ ఫైర్ అయ్యారు నాని.. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదన్న ఆయన.. 1999లో చంద్రబాబు సీఎంగా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్ధి ఓడి పోయారు.. దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలి అని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచాను అన్నారు.. 2014లో అవినాష్ ను గెలిపించాలని కోరితే ఓడించారన్న ఆయన.. చంద్ర బాబు జిత్తుల మారి నక్క.. చంద్రబాబు గుడివాడకు చేసింది ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ప్రతి ఒక్కరి హక్కులను కాపాడిన వ్యక్తి అంబేద్కర్.. రాజ్యాంగం ద్వారా వ్యవస్థలు ప్రజలకు ఎలా సాయం చేయాలో చెప్పారు.. బడుగు బలహీన వర్గాలకు ఎలా సాయపడాలో అంబేద్కర్ చెప్పిన దారిలో మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు కొడాలి నాని.. బెజవాడలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం వాయిదా పడింది.. 3 నెలల్లో పనులు విగ్రహం ప్రారంభోత్సవం చేస్తాం అన్నారు.. ఇక, నారా లోకేష్ ఆస్తుల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.627 కోట్లు.. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.20 కోట్లు… కానీ, చంద్రబాబు ఆయన భార్య ఆస్తి బయట పెట్టరు అని మండిపడ్డారు.. వైఎస్ జగన్ దంపతుల ఆస్తి కంటే చంద్ర బాబు ఆస్తి ఎక్కువ అని పేర్కొన్న ఆయన.. భార్య ఆస్తి కలిపి కూడా చెప్పుకోలేని దారుణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు కొడాలి నాని.