ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. లెట్స్ వాచ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో…
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
Mithun Reddy: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారు.. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు.
MP Midhun Reddy: తిరుపతి జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమైయ్యారు. అయితే, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పర్యటనకు వెళ్తే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు.
ALi Resigns YSRCP: 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతున్నాను నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని…
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.