బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
మొన్నటి వరకు బాలయ్యా… నువ్వు ఎక్కడయ్యా..? అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్. కానీ ఇప్పుడదే సీన్ రివర్స్ అవుతోందట. వైసీపీ లీడర్స్ టార్గెట్గా రివర్స్ పంచ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ… మీరెక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది హిందూపురంలో. కొత్తగా వచ్చిన మార్పేంటి? నోరుందికదా అని ఏదిపడితే అది మాట్లాడకు రా… నాయనా… రేపు అది మనకు కూడా తగలొచ్చంటుూ జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు ఇవే మాటల్ని రిపీట్…
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు.
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎంపికయ్యారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు.