టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో.. జగన్ మోహన్…
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని…
ఏపీలో రాజకీయం రాజుకుంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిస్తే.. కౌంటర్ గా వైసీపీ కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసనలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకులపై దాడులు ద్వారా అంతర యుద్ధం జరగాలని జగన్ కోరుకున్నాడని ఆరోపణలు చేశారు. జగన్ తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టాడని విమర్శించారు.…
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య…
డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు..…
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది… ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి… మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.. గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి.. వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. గంజాయి విషయంలో టీడీపీ నేతలకు నోసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. సీఎంను టార్గెట్ చేశారు…
సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ…