ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం మునిసిపల్ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జరుగుతుండడంతో అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ నేతల అరెస్టులు అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి. కుటుంబంలో స్థానికేతరులు తిష్టవేసి ఉన్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఉదయం నుంచి రెండుసార్లు పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో పరిస్థితిపై ఆరా తీశారు.…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్,…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో…
ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ…
ఏపీలో రాజకీయ దుమారం రేపిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. చంద్రబాబు ఏపీకి సీబీఐ, కేంద్ర బలగాలు రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వైసీపీ శ్రేణులు…
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని…
ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్ కు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్టాభిరామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు.…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. టీడీపీ కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే.. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించలేదని.. దీంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం అన్నారు..…