నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా వుండే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సరదాగా సేదతీరారు. అది కూడా అండమాన్ దీవుల్లో. ఆయన చేసిన స్కూబా డైవింగ్ యువకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ స్కూబా డైవింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆమె కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కడపలో ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్ స్టీల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి. గురువారం నాడే ప్రధాని మోడీతో విజయసాయి భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత…