తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.
బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..
YV Subba Reddy: అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి టీడీపీ నేతలు వైసీపీ వారిపై దాడులు చేస్తున్నారు అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారు.. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం.. ప్రజల పక్షాన నిలబడతాం.. ఓ పక్క భారీ వర్షాలతో రాష్ట్రమంతా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. Also…
రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు.
మా కార్యకర్తలు ఆర్ధికంగా చెడిపోయారు.. నాలుగు సంవత్సరాలుగా ఖర్చు మాత్రమే పెట్టారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏ కార్యకర్తకు పైసా లబ్ధిలేదు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మా కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.. మా కార్యకర్తలు అందరూ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.