Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి.