నిన్న వైఎస్సాఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటన వివాదం రేపుతోంది. అయితే వైఎస్సాఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నరసరావుపేటలోని జొన్నలగడ్డలో టీడీపీనేత అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలతో ధర్నా దిగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. అయితే ధర్నా విరమించాలని అరవింద్‌ను పోలీసులు కోరగా అరవింద్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.…