ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. టీడీపీ సమస్యలని ప్రస్తావిస్తే.. వైసీపీ బూతులు తిడుతుంది. బూతులు తిట్టడం నాకు రాదు. ప్రత్యర్ధులు బూతులు తిడితే టీడీపీ కూడా తిట్టాల్సిన అవసరం లేదు.సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేశారు.నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారు. వివేకా…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది… తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఆయుధాల కోసం తవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సీబీఐ… దీంతో, రోటరీపురం, గరండాల వాగు వద్ద తవ్వకాలు నిలిపివేశారు.. బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్‌ను ఎత్తేశారు అధికారులు.. ఇక, ఆ రహదారి గుండా యథావిథిగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు.. కాగా, మూడు రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆయుధాలు లభించలేదు.. మురికి…
మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం రెండు ప్రాంతాల్లో మూడవ రోజు అన్వేషణ కొనసాగుతుంది. పులివెందులలోని రోటరీపురం వాగు, తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని గరండాల వంకలో అన్వేషిస్తున్నారు . నిన్న వాచ్ మెన్ రంగన్న, ప్రకాష్ రెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్ లను విచారించిన సీబీఐ అధికారులు.. అనంతరం మరో కోత్త ప్రాంతంలో ఆయుధాల కోసం అన్వేషణ ప్రారంభించారు. వ్యర్థాలను తొలగిస్తున్నారు ఇరవై మంది మున్సిపల్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ 16 వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా నిన్న (సోమవారం) కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో…
వైఎస్ వివేకా హత్య కేసులో 15వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఈ కేసులో ఆరుగురు అనుమానితులు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అటు వరుసగా 5వ రోజు సీబీఐ విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హాజరు కావడం విశేషం. ఎర్ర గంగిరెడ్డితో పాటు పులివెందులలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు కృష్ణయ్య, సావిత్రి, కుమారులు సునీల్ యాదవ్, కిరణ్ కుమార్…
వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈరోజు తాజాగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా కార్యకర్తలు లక్ష్మీ రంగా, రమణను ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు… వారితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. గతంలో వివేకా దగ్గర జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేసాడు. అయితే చూడాలి మరి…
నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఐదో రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో విచారణ చేస్తుంది సీబీఐ అధికారుల బృందం. ఇక నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి,,కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను 8 గంటల పాటు ప్రశ్నించారు. నేడు విచారణకు వివేకా కుమార్తె సునీత వచ్చే అవకాశం ఉంది. ఇక పులివెందులలో వైయస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకా ఇంటితో పాటు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు..…