సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రేపు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయనున్నారు.. ఈ సందర్భంగా గజ్వేల్ మండలం అనంతరావు పల్లి లో ఆరు నెలల క్రితం ఉద్యోగం రాలేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంభ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. పరామర్శ అనంతరం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో నిరోద్యోగ దీక్షలో పాల్గొననున్నారు వైఎస్. షర్మిల. అయితే… వర్షం కారణంగా…
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబం షాక్ ఇచ్చింది.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆ తర్వాత దీక్ష చేయాలని ప్లాన్.. కానీ, రేపటి షర్మిల నిరసన దీక్షకు…
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి…
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి…
కొత్త గా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడు గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సర్కారే టార్గెట్ గా కార్యచరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సోమ్ల తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబానికి ఈ సందర్భంగా పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. ఆ తర్వాత అదే జిల్లాలోని గుండెంగి గ్రామం లో షర్మిల ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఇక ఇవాళ రాత్రి వరంగల్ లోనే…
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం…
తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో…