ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. కేసీఆర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 50వేల ఉద్యోగాల ప్రకటన.. జాబ్ క్యాలెండర్ ను దసరాకు రిలీజ్ చేసి అటు వైఎస్ షర్మిలకు ఎజెండా లేకుండా చేయడం.. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు మూయించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేరడంతోపాటు వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ లను దెబ్బతీయవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థి…
వైఎస్ షర్మిల.. గతంలో జగనన్న బాణం. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ.. అధికారం లక్ష్యంగా సాగుతున్న పయనం. ఆమె అడుగులు ఎక్కడివరకూ పడతాయి.. లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక.. చతికిలబడతారా.. అన్నది పక్కన బెడితే.. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ మాత్రం.. వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఒంటరినైపోయానంటూ.. ఆమె వైఎస్ ను తలుచుకోవడం.. చర్చనీయాంశమైంది. ఇక్కడే… ఓ విషయాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. జగన్ సైతం వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత.. ఒంటరిగా నిలిచారని..…
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్…
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వైఎస్ఆర్ మావాడంటే.. మావాడంటూ నేతలు పోటీపడుతున్నారు. ఇదికాస్తా శృతిమించుతుండటంతో అందరిబంధువైన వైఎస్ఆర్ ఇప్పుడు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. నిన్న హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంగా సాక్షిగా ఈ విషయం రుజువైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ విడిచి 12ఏళ్లు గడుస్తుంది. నిన్ననే ఆయన 12వర్ధంతిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss…
రేపు వైఎస్సార్ 12వ వర్ధంతి ఉన్న నేపథ్యం లో ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే… లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్ షర్మిల. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ దగ్గర విజయమ్మ తో కలిసి నివాళులు అర్పించనున్నారు వైఎస్ షర్మిల. ఇక ఆ కార్యక్రమం అయ్యాక… రేపు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు…
రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 2న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఛాతీ లో ఉన్నది గుండెనా? బండ నా? అంటూ తీవ్ర స్థాయి లో వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గజ్వేల్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని… వారికి అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గజ్వేల్ కి ఏమి చేశాడని మండిపడ్డారు. తాలిబన్ల చేతి లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు…