తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని ఎక్కడా రూల్ లేదన్నారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను.. అందులో నడుస్తున్నాను అంటూ.. భవిష్యత్తు పై పార్టీ పెట్టే యోచన వుందని పరోక్ష సంకేతాలు అందించారు వైఎస్ షర్మిల.. అయితే, ఇప్పుడు ఏపీలోనూ పార్టీ పెట్టే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Read Also: Telangana Budget 2022-23: రాష్ట్ర బడ్జెట్ హైలైట్స్..
అందులో భాగంగా ముందస్తుగా 13 జిల్లాల క్రిస్టియన్, బీసీ, మైనారిటీ సంఘాల నేతలో బ్రదర్ అనిల్ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది… మీటింగ్‌లో జరిగి విషయాలు… మీ ప్రాంతంలోని ప్రజలకు చెప్పి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని బ్రదర్ అనిల్ సూచించారని సమాచారం.. మీటింగ్‌లో ప్రతి ఒక్క నాయకులు షర్మిలకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అలోచనలలో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులు ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. పార్టీని గెలిపించిన తరువాత తమను పట్టించుకోవడం లేదంటున్న బ్రదర్ అనీల్ ఎదుట బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ నాయకులు వాపోయినట్టుగా ప్రచారం సాగుతోంది. షర్మిల మీకు అండగా ఉంటారని అందరికి బ్రదర్ అనిల్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అవకాశం ఉంటే ఈ నెలలోనే పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేద్దామని నాయకులకు చెప్పినట్లుగా వార్తలు గుప్పమన్నాయి. 13 జిల్లాలోని సంఘాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని బ్రదర్ అనిల్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఎక్కడ పెట్టాలనేది త్వరలో చెపుతానని.. బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులకు బ్రదర్ అనిల్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.