ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.