YS Jagan: ఇప్పుడే కృష్ణానదికి వరద నీరు ఇలా వస్తుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్.. కొత్త రిజర్వాయర్లకు కాదు.. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపే కార్యక్రమమే ఇది.. తెలంగాణ, ఏపీ ఇద్దరూ ఒక్కటే.. తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చే పనులు జగన్ ఎప్పుడూ చేయడని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.