గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసే అర్హత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఉందా? అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు, అయన బాగోతం రెండు రోజుల్లో బయటపెడతా అని హెచ్చరించారు. మాజీ మంత్రి కాకాణి వల్ల ఎంతో మంది అధికారులు సస్పెండ్ అయ్యారని, అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని పేర్కొన్నారు. జగన్ వల్ల ఎంతో మంది జైలుకు…
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం…
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం…