Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీపై నేడు కేంద్ర జల విద్యుత్ శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు.
YV Subba Reddy: మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని సుబ్బారెడ్డి కితాబిచ్చారు. ఇక…
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో భారతదేశంలో సూదీ కూడా తయారుచేయలేదని నెహ్రూ పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించారని, ఆటమిక్ ఎనర్జీ ప్లాంటులను కూడా స్థాపించారన్నారు. ఐఐటీలను, ఐఐఎం ల స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. ఎర్రకోటలో నిర్వహించిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని అందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.…