పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు. కుమార్తెను కలిసి బయటకు వచ్చిన తర్వాత హరీష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె నేరాన్ని అంగీకరిస్తోందని.. నిర్దోషినని చెప్పిందని పేర్కొన్నాడు. గతంలో హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో వీడియోలు తీసేందుకే వెళ్లిందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: YS Jagan: “టీడీపీ” తెలుగు డ్రామా పార్టీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చర్యలకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద ఆమెపై కేసు నమోదు చేసిన తర్వాత మే 17న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో ఆమెను ఐదు రోజుల కస్టడీలో ఉంచారు. అనంతరం మే 22న మరో నాలుగు రోజులు పొడిగించారు. తిరిగి మే 26న ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం హిసార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?
9 రోజుల పోలీస్ కస్టడీలో జ్యోతిని విచారించినట్లు పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. వ్యూహాత్మక సమాచారాన్ని లేదా సైనిక సమాచారాన్ని పంచుకున్నట్లు ఆధారాలు దొరకలేదన్నారు. అయితే పాకిస్థాన్ నిఘా వ్యక్తులతో ఉన్నట్లు గుర్తింపబడిందన్నారు. వాళ్లతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు ధృవీకరించారు. దర్యాప్తు సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారించాయని పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన నాలుగు బ్యాంక్ ఖాతాల డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక జ్యోతి మల్హోత్రా ఇస్లాం మతంలోకి మారినట్లు గానీ.. లేదంటే పాకిస్థాన్ నిఘా వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ గూఢచర్యగా పని చేసినట్లుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె 3 సార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చింది. అంతేకాకుండా పలుమార్లు కాశ్మీర్ సందర్శించింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి ముందు కూడా అక్కడ వీడియోలు తీసినట్లుగా గుర్తించారు. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా వ్యక్తులతో పంచుకున్నట్లుగా అనుమానించి జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వీడియోల్లో పాకిస్థాన్ అధికారులు చాలా క్లోజ్‌గా ఉన్న దృశ్యాలు కనిపించాయి.