YouTube: యూట్యూబ్ తప్పుడు "థంబ్‌నెయిల్స్", "టైటిల్స్"పై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారుల్ని మోసగించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త పాలసీని తీసుకురాబోతోంది. చాలా సందర్భాల్లో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ‘‘క్లిక్‌బైట్’’ వీడియోలపై కఠినంగా వ్యవహరించనుంది.