Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.