ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శివుడి భక్తిలో మునిగిపోయిన ఒక భక్తుడు.. దేవుడు కోసమని తన తలను సమర్పించేందుకు ప్రయత్నించాడు. 28 ఏళ్ల దీపక్ కుష్వాహ వుడ్ కట్టర్ మెషీన్లో తల పెట్టాడు.
సీఎం నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్లోకి దూసుకు వచ్చాడు.
ఓ వ్యక్తి తనకు కాబోయే భాగస్వామికి ఎలాంటి కండిషన్స్ పెట్టాడో చూస్తే.. మీరు షాకవుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తి పెట్టిన షరతులు ఎన్నో తెలిస్తే.. ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఓ యువకుడు తన కాబోయే భార్య కోసం రెడ్డిట్‌లో 15 షరతులతో కూడిన పోస్ట్ చేశాడు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, ముక్కుతో ఫోన్ లో టైప్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని స్మిత్ నిరూపించాడు
సబితం జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై…
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళను వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో.. యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం ఫాజిల్ ఖాన్ గా ఉన్న తన పేరును అమన్ రాయ్ గా మార్చుకున్నాడు. మతం మారిన తర్వాత తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకున్నాడు.