ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి ఆ యువతి మృతికి కారకుడైన డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ మోసగాడిని కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి శంషాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన పూజిత (27) ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది. అయితే ఆఫిస్ కు వెళ్లె క్రమంలో మహమ్మద్ అలి అనే డాక్టర్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. అలికి వివాహమై భార్య కూడా ఉంది. వివాహమైన విషయం పూజతతో చెప్పకుండా దాచాడు. దీంతో అమె అతనితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది.
కొన్ని రోజులకు పూజిత ఉద్యోగం వదిలేసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవ్వాలని శంషాబాద్ లోని రాయల్ విల్లస్ కాలనీలో గోవర్దన్ రెడ్డి ఇంట్లోని మూడో అంతస్తులో రూమ్ అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. అయితే అక్కడికి డాక్టర్ మహమ్మద్ అలీ వచ్చిపోయేవాడు ఈ క్రమంలో అతనికి వివాహం అయిందని పూజితకు తెలిసింది. దీంతో ఇక తనను పెళ్లి చేసుకోవాలని అడగడంతో అతను మోహం చాటేశాడు. అయితే పూజిత తీవ్ర మనస్థాపానికి లోనై తాను ఉంటున్న ఇంట్లో విండోకు చున్నీతో మెడకు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది.
Read Also: Zelensky: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. అనేక ప్రాంతాల్లో అంధకారమే..
దీంతో మూడు రోజులుగా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నా శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో మహమ్మద్ అలి ప్రేమ పేరుతో మొసం చేశాడని దీంతో అమె ఆత్మహత్య చేసుకునట్లు తెలడంతో నిందితుడు మహమ్మద్ అలిని అరేస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
Read Also: Harish Rao Cricket: ఆటవిడుపు.. క్రికెట్ ఆడి అలరించిన హరీష్ రావు