Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ హైకోర్టు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బిగ్ రిలీఫ్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిత్వానికి సంబంధించిన గుర్తింపులను వ్యాపార పరంగా లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించకుండా మూడో వ్యక్తులపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆయన పేరుతో వస్తువులను విక్రయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించే ‘డీప్‌ఫేక్’ కంటెంట్‌ను తయారు చేసి వ్యాప్తి చేయడంపై కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలతో నిషేధించింది. యువరాజ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోతి సింగ్ విచారణ జరిపారు.
యువరాజ్ సింగ్ మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో ఒకరని, ఆయన 17 ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని కోర్టు పేర్కొంది. ఆయన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ‘యువరాజ్ సింగ్’ లేదా ‘యువి’ అనే పేర్లు, ఆయన చిత్రం, వాయిస్, రూపాన్ని అనధికారికంగా వాడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఏఐ సాయంతో ఆయనపై అనుచితమైన ఫోటోలు, వీడియోలు సృష్టిస్తూ, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, ఇతర క్రికెటర్లతో గొడవపడుతున్నట్లు చూపించే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని యువరాజ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ తరహా ప్రచారం వల్ల యువరాజ్ ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని భావించిన కోర్టు, మెటా వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను సదరు వివాదాస్పద కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తన గుర్తింపు ద్వారా పొందే వ్యాపార ప్రయోజనాలపై యువరాజ్‌కు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని వెల్లడించింది. గతంలో కూడా ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, క్రిటికల్ ప్లేయర్ అభిషేక్ శర్మ వంటి పలువురు ప్రముఖులు తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి ఉపశమనాన్నే పొందారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!