వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది.