రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. అయితే ఆమెతో భేటీకి పలువురు సీఎంలు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా తమకు ఎలాంటి ఆహ్వానం…
ఏపీలోని మూడు ప్రాంతాల్లో శనివారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రేపటి నుంచి మూడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జాబ్ మేళా ఉంటుందన్నారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. 35 నెలల్లో వైసీపీ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో కేవలం…
సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని.. చంద్రబాబు ఐరన్ లెగ్ కారణంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీ కళ్లు తేలేసిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అఖిలేష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం…
వైసీపీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని ఇటీవల సీఎం జగన్ నియమించగా.. అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ సభ్యత్వ నమోదులో ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగువారు…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కాగా వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా…
విజయవాడ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం జగన్‌ను మెచ్చుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సాధారణంగా మితభాషి అని.. ఆయనకు పొగడ్తలు అంటే గిట్టవు అని.. అందుకే ఆయన ఎవరినీ ప్రశంసించిన దాఖలాలు ఉండవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాంటి నితిన్ గడ్కరీ జగన్‌ను మెచ్చుకోవడం మాములు విషయం కాదన్నారు. ఏదైనా సాధించగల గట్టి ఆశయాలు ఉన్న డైనమిక్ లీడర్ జగన్ అని నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం…
ఏపీలో గత మూడు రోజులుగా కరెంట్ కష్టాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో కరెంట్ కష్టాలు త్వరలో తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. Read Also: సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల కమిటీ భేటీ కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని.. కానీ అలా లేదని తెలిపారు. పైకి అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ అంత ఉపయోగకరంగా అనిపించడంలేదని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్రమంత్రి…