టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్‌పై…
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, అందుకే యువత అందరూ ఓటు వేయడం మన కర్తవ్యంగా పరిగణించాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందేనని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి ఏడాది జనవరి 25న…
ఎన్టీఆర్ 26వ వర్థంతి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా సోకడం యాధృచ్ఛికమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని.. ఆయనకు వచ్చిన కరోనా తగ్గిపోతుందేమో కానీ… ఆనాడు ఎన్టీఆర్‌కు బాబు పొడిచిన వెన్నుపోటు తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ…
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ మంగళవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక…