YSRCP MLCs: ఇక, ముఖ్యమంత్రి, మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు.. మండలి విరామ సమయంలో చిట్ చాట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అని కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంబోధిస్తున్నారు.. ఇక, నుంచి మా పంథా కూడా మారుతుంది.. ఇక నుంచి శాసనమండలిలో సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అన్నారు..…
Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు కల్యాణ్…
ఈ నెల 24వ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు..
వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ,…
వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి.
వరద బాధితులకు వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్సీలుగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, విపక్షాలపై ఫైర్ అయ్యారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ తలరాత వాళ్ళే రాసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు ఉన్నాయన్న ఆయన.. 17 మంది గెలిస్తే వారిలో 10 మంది బీసీ వర్గాలకు చెందినవారే అన్నారు. జూన్ నాటికి…