పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ గ్రూపు యాజమాన్యం. తమ మాతృభూమి అయిన మేడిపల్లి-రాంపూర్ గ్రామాల్లో రూ 1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రంగా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్‌రావు, గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి దేవేందర్‌రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.…