ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. యమునా…
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ( శనివారం ) సాయంత్రం ఆరు గంటల తర్వాత మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు వానా పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. దీంతో వర్షం గట్టిగానే దంచి కొడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఇప్పుడిప్పుడే నది ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.62 మీటర్లుగా నమోదైంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకు యమునా నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది.
Delhi Floods: ఢిల్లీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యయునా నది మహోగ్ర రూపం దాల్చింది. 1978 తర్వాత రికార్డు స్థాయిలో 207.49 మీటర్ల గరిష్ట నీటిమట్టానికి యమునా నది చేరింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయాలని ప్రజలను సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో లోతట్టు ప్రాంతాల…
ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది.
దేశ రాజధానిలో యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్ కోసం రూ.1,028 కోట్ల అనుబంధ గ్రాంట్‌ను ఢిల్లీ జల్ బోర్డుకు ఇచ్చేందుకు ఢిల్లీ అసెంబ్లీ గురువారం ఆమోదించింది.