UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు…
Delhi: ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్‌బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Tragedy : ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లాస్వామి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికై యమునా నదిని సందర్శించిన ఆరుగురు యువతులు మృత్యువాత పడ్డారు. ఒక్క కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు యువతులు అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ ఒక యువతి నీటిలో మునిగిపోవడం చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. GHMC : జీహెచ్‌ఎంసీ బార్లకు…
Yamuna River: ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది. కార్తీక మాసం సందర్బంగా ఉదయం భక్తులు యమునా నదిలోకి దిగి సంప్రదాయ పూజలు చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ నదిలో వ్యాపించిన నురుగు ఈ పండుగను ఆందోళనల మబ్బులో పడేసింది. తాజాగా డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో, నదిపై ముదురు తెల్లని నురుగు…
Delhi: ఢిల్లీలో యమునా నది కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది. విషపూరిత నురగ యమునా నదిలో ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే యమునాలో ఎలాంటి కాలుష్యం ఉందో, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన ప్రయత్నం.. ఆయనను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.
Delhi In Danger: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యపు విషం మితిమీరిపోతుంది. అయితే, వాతావరణ కాలుష్యమే కాకుండా నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. ఓ వైపు ఢిల్లీ గాలి కలుషితమై ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంటే., మరోవైపు యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం మొదలైంది. ఓ నివేదిక ప్రకారం.. నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా పండుగ సమయంలో పూజించే వారికి ఇది ప్రమాదకరం. ఇదివరకు వర్షాలు బాగా కురవడంతో…
Delhi High Court: యమునా నదీ ఒడ్డున అక్రమం నిర్మించిన శివాలయం కూల్చేవేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులోకి దేవుడిని తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది.
Delhi : ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న నలుగురు స్నేహితులు యమునా నదిలో మునిగి మృతి చెందిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం రేపుతోంది.
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.