సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. ఆపై డైలాగులు వైవిధ్యంగా వల్లిస్తూ, తనదైన మేనరిజమ్ తో కామెడీ రోల్స్ లో భలేగా ఆకట్టుకున్నారు. సుధాకర్ 1959 మే 18న జన్మించారు. రాయలసీమకు చెందిన వారు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్. దాంతో పలు చోట్ల సుధాకర్…