తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు భక్తులతో నిండిపపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయ పద్దతిలో కొనసాగాయి. Read Also: ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను…
భువనగిరి (మ) వడపర్తి ఎంపీ దత్తత గ్రామంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కలెక్టర్ పమేలా సత్పతి. అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ముఖ్యమంత్రి అని.. ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని హామీ ఇచ్చారు ఒకసారి వడపర్తి వచ్చి చూడు ఇక్కడ బోర్ నీళ్లే ఉన్నాయని ఫైర్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ఛాంబర్ ముందు తండ్రి, కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య అనే వ్యక్తి వెల్లడించాడు. Read Also: దేశంలోనే నంబర్‌వన్ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి 20 ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు…
యాదాద్రి జిల్లాలోని వంగపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కెమికల్స్ ఎగసిపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. సైరన్ మోగడంతో కార్మికులు భయంతో పరుగులు తీయగా.. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. కెమికల్స్ రోడ్డుపైన పడటంతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత నాలుగు నెలలుగా ప్రతిరోజూ రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో బాధిత మహిళ ఈనెల 8న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. Read Also: జగన్ పాలన అద్భుతం.. మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది: నటుడు అలీ తహసీల్దార్ దయాకర్‌రెడ్డి నిజంగానే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ లో రేడియో డయగ్నోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:40 యాదాద్రిలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. 10:30 యాదగిరిగుట్టలో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చ్ రాష్ట్ర కార్యవర్గం సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు బండి సంజయ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈమేరకు ఆగస్టు…
కంటికి కనిపించని మాయదారి కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా ఉండొద్దని ఎంత ప్రచారం చేసినా.. కొందరు పెడచెవిన పెడుతూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువకులు కోవిడ్ బారినపడ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడినట్టు చెబుతున్నారు..…