యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ లో రేడియో డయగ్నోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:40 యాదాద్రిలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. 10:30 యాదగిరిగుట్టలో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చ్ రాష్ట్ర కార్యవర్గం సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు బండి సంజయ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈమేరకు ఆగస్టు 9న బండి సంజయ్ పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కమలదళం భావిస్తోంది.