KTR: మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత ఆధునిక విక్రయాల షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయంపై నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
మునుగోడు పోలింగ్ ప్రారంభమైనవేళ తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్ అక్కడకు చేరుకున్నారు.
Suicide Note: తన చావుకు ఉపాధ్యాయుడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ విధ్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆకాష్ ఓ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ లాగేనే తను కాలేజ్ కి వెళ్లాడు. క్లాస్ రూం లో సెల్ ఫోన్ చూస్తుండగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాథ్స్ లెక్చర్ ఆ సెల్‌ని చూసాడు. అందులో ఓ విద్యార్థిని ఫోటో డీపీగా…
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను…
మానవత్వం మంట కలిసింది. ఖాకీ నిర్లక్ష్యానికి మూడు నెలల చిన్నారి బలైంది.ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. వెయ్యి రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.యాదగిరిగుట్ట పోలీసుల దాష్టీకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో.. ఓ ప్రైవేట్ కారులో హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు…
మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొనడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మరణించింది. మనం…
యాదాద్రి కూడా హైదరాబాద్‌తో కలిసి పోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు.. రూ.53.20 కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు.. భూముల విలువ విపరీతంగా పెరిగిందని… యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందన్నారు. ఇక, భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు,…