Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షన వనరులను ఉపయోగించుకుని మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి…
ChatGPT : చాట్ జీపీటీ ఇప్పుడు ఈ పేరు హాట్ టాపిక్.. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ తల్లికే గుబులు పుట్టిస్తున్న పిల్ల బ్రౌజర్. దీని రాకే ఓ సంచలనం.
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు.
Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
Xi Jinping warns of 'tough challenges' in China's 'new phase' of Covid: 2023లో చైనా కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోందని అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో జిన్ పింగ్ తన న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయని.. ప్రస్తుతం కోవిడ్ -19 కొత్తదశలోకి ప్రవేశించిందని అన్నారు. భారతదేశం, ఇతర దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాంక్షలు విధించాయని జిన్…
Outbreak of Covid-19 in China: చైనాలో కోవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా దేశంలో గురువారం 34,980 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30,702 మందికి లక్షణాలు లేవని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు రోజు బుధవారం 36,061 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభన ప్రారంభం అయిన తర్వాత చైనాలో ఇప్పటి…
డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.
Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు…
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.