చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొంతకాలంగా జిన్‌పింగ్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి.