ఆగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. తామేమీ తక్కువ కాదని నిరూపించింది. తాము కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది.
కేరళ పోలీసుల తీరుపై కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. తనిఖీల పేరుతో పార్టీ మహిళా నేతలు ఉన్న గదుల్లోకి ప్రవేశించడం సరికాదంటూ మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హాట్ టాఫిక్‌గా మారింది.