ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.