విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్‌కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది.
Ellyse Perry receives framed broken window gift: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెర్రీ బ్యాట్ (66; 50 బంతుల్లో 8×4, 1×6), బంతి (4-29-1)తో రాణించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన పెర్రీపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఆర్‌సీబీ తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర…
WPL 2024 Final Match DC vs RCB Playing 11: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకి షాకిచ్చిన బెంగళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీలోని…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో లీగ్ దశలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెంట్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. గుజరాత్ జైన్స్ నిర్ణయించిన 127 పరుగుల స్వల్ప లక్షాన్ని ఢిల్లీ ఛేదించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్…