WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్.. కొత్త విజేత ఎవరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2024 Final Match DC vs RCB Playing 11: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకి షాకిచ్చిన బెంగళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే టైటిల్ కైవసం చేసుకోవచ్చు. అయితే టాపార్డర్ వైఫల్యం బెంగళూరును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎలీస్ పెరీ బాగా ఆడింది. స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌లు కూడా రాణిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గతేడాది రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొ చ్చిన ఢిల్లీ.. భారీ స్కోర్లతో విరుచుకుపడుతోంది. బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్‌లు రాణిస్తున్నారు. ఢిల్లీని ఆపాలంటే బెంగళూరు శ్రమించాల్సిందే. అరుణ్ జైట్లీ స్టేడియం బౌలర్లకు అనుకూలించనుంది. ఇక్కడ బ్యాటర్లు శ్రమించాలి. మ్యాచుకు వర్ష సూచన లేదు.
Also Read: Mirnalini Ravi : విజయ్ ఆంటోనీ రొమాన్స్ బాగా చేసారు..
తుది జట్లు (అంచనా):
ఢిల్లీ: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే.
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్‌హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!