ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఇవాళ హదరాబాద్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకనున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్…