డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు హోమియోపతి పితామహునిగా, ఒక గొప్ప వైద్య శాస్త్రవేత్తగా మరియు ఒక అద్భుతమైన చికిత్సావిధానాన్ని ప్రపంచానికి అందించిన ఒక విజ్ఞానిగా మన అందరికీ సుపరిచితం. జర్మన్ వైద్యులైనటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు అల్లోపతి వైద్య రంగంలో పట్టభద్రులుగా వైద్య విద్యను అభ్యసించిన వ్యక్తి. ఒక రోజు ఆంగ్ల పుస్తకాన్ని జర్మన్ భాషలోని అనువదించే సమయంలో సింకోనా ఆఫీసినలిస్ అనే చెట్టు యొక్క బెరడు రసాన్ని తీసుకుంటే విపరీతమైన చలి వస్తుందని, దానితో…