క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది.. ఈ విషయాన్ని చాలా మందికి మింగుడు పడటం లేదు.. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది.. మ్యాచ్ ఓడిన తర్వాత టీమ్ అందరు ఎమోషనల్ అయ్యారు.. కోహ్లీ బాధపడుతుంటే అతని భార్య అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో…
IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటింగ్ నిస్సహాయంగా కనిపించింది. ప్రపంచకప్‌లో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో భారత జట్టు మొత్తం ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. మొదట్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుని అన్నీ మ్యాచ్ల్లో గెలుపొంది. ఇప్పుడు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ను ఒడిసిపట్టింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ అహ్మదాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ, రిచర్డ్ మార్లెస్ స్టేడియానికి చేరుకుని మ్యాచ్ ను తిలకించనున్నారు.
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు.
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో…
BJP vs Congress: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈసారి రోహిత్ సేన వరల్డ్ కప్ తీసుకురావాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు సెలబ్రిటీలు టీం ఇండియాకు విషెస్ తెలుపుతున్నారు.
Zero Housefulls for movies Due to World Cup 2023: ఇండియా vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ దెబ్బతో థియేటర్లలో సినిమాలకు జీరో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. సాధారణంగా, మ్యాట్నీ ఫస్ట్ షోల కోసం థియేటర్లలో అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ నమోదు చేయడంతో, సినిమాలకు ఆదివారం బుకింగ్‌లు చాలా బలంగా ఉంటాయి. కానీ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ కారణంగా ఇండియన్ సినిమాలోని అన్ని భాషల…