Shakib Al Hasan: నా జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది.. మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై షకిబ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Captain Shakib Al Hasan React on Angelo Mathews Timed Out dismissal: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్.. గార్డ్ తీసుకోకుండా హెల్మెట్ (కొత్త హెల్మెట్) కోసం వేచి చూశాడు. సమయం మించిపోవడంతో బంగ్లా కెప్టెన్ షకిబ్ హల్ హాసన్ ఔట్ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై షకిబ్ స్పందించాడు.
తాను ఆటలోని నిబంధనల ప్రకారమే ఆడుతున్నానని, ఎవరికైనా సమస్య ఉంటే నిబంధనలను మార్చమని ఐసీసీని కోరాలని బంగ్లా కెప్టెన్ షకిబ్ హల్ హాసన్ ఘాటుగా స్పందించాడు. ఆ సమయంలో తన జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించిందన్నాడు. ‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఏంజెలో మాథ్యూస్ ఇంకో హెల్మెట్ కోసం అడిగాడు. ఆ సమయంలో నా సహచర ఆటగాడు నా దగ్గరకు వచ్చి మనం అప్పీల్ చేస్తే.. అంపైర్ మాథ్యూస్‌ని ఔట్‌గా ప్రకటిస్తాడని చెప్పాడు. టైమ్డ్ ఔట్ ఐసీసీ నిబంధనల్లో ఉందని తెలిపాడు. వెంటనే నేను అప్పీల్ చేశా’ అని షకిబ్ తెలిపాడు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
Also Read: Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్‌లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్
‘సీరియస్‌గానే అప్పీల్ చేస్తున్నావా? అని అంపైర్స్ నన్ను అడిగారు. ఐసీసీ నిబంధనల్లో ఉంది కాబట్టి అవుననే చెప్పా. అది తప్పోఒప్పో తెలీదు కానీ.. నేను యుద్ధంలో ఉన్నాననిపించింది, జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది. అందుకే అప్పీల్ చేశా. ఆటలోని నిబంధనల ప్రకారమే నేను అప్పీల్ చేశా. ఎవరికైనా సమస్య ఉంటే.. నిబంధనలను మార్చమని ఐసీసీని కోరండి. దీనిపై చర్చ సాగుతూనే ఉంటుంది. విజయం సాధించడంలో టైమ్డ్ ఔట్ ఉపయోగిపడిందని నేను అంగీకరిస్తా’ అని బంగ్లా కెప్టెన్ షకిబ్ చెప్పాడు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!