AUS vs AFG: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు దక్కుతుందా?! అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia and Afghanistan Semi Final Chances for ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాకే కాదు ఈ మ్యాచ్ అఫ్గానిస్థాన్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై గెలిస్తే.. 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుని అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
సెమీస్ బెర్తు దక్కుతుందా?:
ప్రపంచకప్ 2023లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా నెగ్గింది. ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు (అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్) ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకి ఒక్కటి గెలిచినా ఆసీస్ మూడో సెమీఫైనలిస్ట్ అవుతుంది. అఫ్గాన్‌పైనే గెలిచి సెమీస్ బెర్త్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే మెగా టోర్నీలో పెద్ద జట్లను ఓడించిన అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించడం అంత సులువేం కాదు. ఆసీస్ మిడిల్ ఆర్డర్ ప్రదర్శన కూడా ఆందోలన కలిగిస్తోంది.
Also Read
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ:
మరోవైపు ప్రపంచకప్ 2023లో సంచనల విజయాలను అఫ్గానిస్థాన్ సాధిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో అఫ్గాన్ ఆడాల్సి ఉంది. రెండు పెద్ద జట్లే కాబట్టి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ప్రస్తుతం న్యూజీలాండ్, పాకిస్తాన్ కంటే అఫ్గాన్‌కే సెమీస్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రెండు పెద్ద జట్లతో ఆడనుండడమే అఫ్గాన్‌కు ప్రతికూలాంశం. 2 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!