IND vs NZ Semi Final 2023 Preview and Playing 11: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ సెమీస్ సవాలుకు సిద్ధమైంది. హడావుడి లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ ప్రత్యర్థులకు షాకులిచ్చే న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడబోతోంది. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్, వాంఖడేలో రికార్డులు చూస్తే.. నేటి మ్యాచ్‌లో రోహిత్ సేననే ఫేవరెట్. అయితే చరిత్ర మాత్రం భారత్ వైపు లేదు. అయినా కూడా…
ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదన్న విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో ఓటమి విషయాన్ని మర్చిపోవాలని అన్నాడు. గతంలో ఏం జరిగిందని కాదు.. గతం గురించి పట్టించుకోమన్నాడు. తమ ఫోకస్ అంతా రేపటి మ్యాచ్ పైనే అని తెలిపాడు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా రేపు, ఎల్లుండి సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీస్ కు చేరిన లిస్ట్ లో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బలమైన జట్లు ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు సంబంధించి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఆడబోయే రెండు జట్ల గురించి ఆమ్లా జోస్యం చెప్పాడు.
ఈ ప్రపంచకప్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రేపు న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఇంతకుముందు న్యూజిలాండ్-ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియాను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చివరి దశకి చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనుండగా... ఈ నెల 19వ తేదీన జరిగే ఫైనల్ జరుగనుంది. దీంతో ఈ మెగా టోర్నీ సమాప్తమవుతుంది. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల కోసం ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిసినప్పటికీ.. రేపు, ఎల్లుండి సెమీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో రేపు (బుధవారం) తొలి సెమీస్ పోరు జరుగనుంది. ఈ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రేపటి సెమీస్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా ఏం చేయాలి అనే ప్రశ్న టీమిండియా అభిమానులందరిలో మెదులుతోంది. అయితే.. ఈ ప్రశ్నపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఓ సలహా ఇచ్చాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో పరుగులను ఛేజ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని తన వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ ఆలౌట్ అవుతుందని చెప్పాడు. వాంఖడేలో మంచు కురిసిన తర్వాత పరుగులను ఛేజింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే, కానీ టీమిండియా ఇంతకుముందు ఆ పని…
వరల్డ్కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు.
David Beckham To Attend IND vs NZ 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న తొలి సెమీస్ జరగనుండగా.. 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారని సమాచారం…
Abdul Razzaq insults Aishwarya Rai: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో పాక్ ఇంటిముఖం పట్టింది. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్తాన్‌పై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఓటములను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మాజీ ఆల్ రౌండర్…