How Much Prize Money Australia won in ODI World Cup 2023: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్…