World Cup 2023 Prize Money: ఆస్ట్రేలియాకు 33 కోట్లు.. వన్డే వరల్డ్‌కప్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How Much Prize Money Australia won in ODI World Cup 2023: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6) సూపర్ సెంచరీ బాదాడు. అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 4 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 33 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ టీమిండియాకు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చింది. సెమీ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు చెరో 8,00,000 డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్లు) అందుకుంటాయి. నాకౌట్‌లకు చేరుకోవడంలో విఫలమైన ఒక్కో జట్టుకు 1,00,000 డాలర్లు (దాదాపు రూ. 83 లక్షలు) ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రతి గ్రూప్ స్టేజ్ విజయానికి 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
Also Read: Rahul Dravid: కాంట్రాక్ట్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోను!
ఇక వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలోప్లేయర్స్ కూడా అవార్డులు గెలుచుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. విరాట్ 11 మ్యాచ్‌లలో 765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు అందుకున్నాడు. అత్యధిక పరుగుల అవార్డు కోహ్లీని వరించగా.. అత్యధిక వికెట్ల అవార్డు మహ్మద్ షమీకి దక్కింది. షమీ (7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ అవార్డు గ్లెన్ మాక్స్‌వెల్ (అఫ్గనిస్తాన్‌పై 201 పరుగులు- నాటౌట్), అత్యధిక సెంచరీల అవార్డు క్వింటన్ డికాక్ (4 శతకాలు)కు దక్కింది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!