దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ప్రారంభమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు చేరుకున్నారు. వీరికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.…